బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన తాజాలుక్‌తో ఫ్యాషన్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోందామె. ఈ నటి అద్భుతమైన ఎరుపురంగు దుపట్టాతో తజ చేసిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో కూడిన కుర్తా సెట్‌లో పండుగ హుందాతనాన్ని ఒడిసిపట్టుకుంది. ఈ దుస్తులు అత్యంత నిరాడంబంరగా ఉన్నా.. దాని ధర తెలిస్తే మాత్రం కంగుతినాల్సిందే.
నటి యామీ ధరించిన ఈ త్రీపీస్ ఎన్సెంబుల్ డిజైనర్ దుస్తులను దేబ్యాని బ్రాండ్ నుంచి ఎంపిక చేసుకున్నారు. చందేరి కాటన్‌తో తయారైన ఈ దుస్తులు పొడవాటి కుర్తా.. దానికి మ్యాచింగ్ ప్యాంటు, క్రష్డ్ దుప్పటాతో మెరిసింది యామీ. బంగారం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల పూల నమునాలు, వజ్రాల స్ఫూర్తితో చేసిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఈ కుర్తా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కుర్తా చేతులపైన, అలాగ ప్యాంట్‌పై వివరమైన అంకరణలు ఉన్నాయి. ముదురు ఎరురంగు దుపట్టా ఆ కుర్తాకు లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. ముఖ్యంగా ఆ కుర్తాపై ఉన్న రంగురంగుల ఎంబ్రాయిడరీ పండుగ శోభను తెచ్చింది. హస్తకళా నైపుణ్యాన్నికి ప్రతికగా, క్లాసిక్ లుక్‌ని అందించాయి. వివాహ వేడుకలు, పండగలు వంటి ప్రత్యేక సందర్భానికి అనువైన డిజైనర్ దుస్తులివి. ఈ డ్రెస్‌కి అనుగుణంగా బంగారు రంగు ఝమ్కాలు, బంగారు ఉంగరాలు ధరించింది.
ఇదీ చదవండి: చీరలో కూడా స్మార్టే అంటున్న: సుధామూర్తి
జుట్టుని మెత్తని అలలా వదిలేసి మధ్యలో చిన్న జడ వేసుకుంది. కళ్లు, బుగ్గలకు తేలికైన మేకప్ టచ్ ఇచ్చి..నేచరుల్‌గా కనిపించింది. ఈ డ్రెస్ ధర వచ్చేసి అక్షరాల రూ. 1.15 లక్షలు. యామీ తన ‘నయ్యి నవెల్లి’ మూవీ ప్రమోషనల్ భాగంగా ఈ లగ్జరీయస్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమా ఈ నెల 16న థియెటర్లలోకి రానుంది.
ఇదీ చదవండి: జస్ట్ 30 సెకన్ల బ్రేక్‌ఫాస్ట్ ఐడియాతో..నెలకు రూ. 1 కోటి సంపాదన!


