ఒక వ్యాపార ఆలోచన విఫలమైతే..మరో వ్యాపారం చేయాలంటే భయమేస్తుంది. ముఖ్యంగా పెట్టుబడి ఎలా అనేది ప్రశ్న..మళ్లీ ఫెయిలైతే పరిస్థితి ఏంటని భయం వెంటాడుతుంటాయి. కానీ కొందరు ఏం జరిగినా తగ్గేదే..లే.. అంటూ మొండి ధైర్యంతో మరోసారి వ్యాపారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని మరి సక్సెస్ అందుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ 21 ఏళ్ల యువకుడు.
ముంబైకి చెందిన 21 ఏళ్ల యశ్‌కల్రా మొదటి వ్యాపార ఆలోచనే దారుణంగా వైఫల్యం చెందింది. అయినా సరే ఎలాగైన తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటూ.మరో వ్యాపార ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులోనూ ముంబైలో ఆరోగ్యకరమైన ఆహారం అన్నది అత్యంత ఖరీదైనది. అందులోనూ అందరివి ఉరుకుల పరుగుల జీవితాలు. అలాంటప్పుడు పోషకవంతమైన ఆహారం అంటే..ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు.
అందుకే యశ్ ఆ దిశగా అడుగులు వేస్తూ పోషకవంతమైన ఓట్స్‌ని ఎంచుకున్నారు. భారతీయ రుచులకు సరిపోయేలా వివిధ ఫ్లేవర్‌లతో.. అధిక ప్రోటీన్ భోజనంగా మార్చాడు. అది కూడా 30 సెకన్లలో చకచక తయారు చేసుకునేలా సిద్ధం చేశారు. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర లేకుండా గోల్‌లైఫ్ అనే ఓట్‌మీల్ బ్రాండ్‌ని అందించాడు. అయితే అంతలా కష్టపడ్డా సక్సెస్ ఏమి సులభంగా ఒళ్లోకి వచ్చి వాల్లేదు. మొదట్లో కేవలం 50 ప్యాక్‌లు మాత్రమే అమ్మేవాడు. ఆ తర్వాత తన ఉత్పత్తిని మెరుగుపర్చే క్రమంలో ఏకంగా రెండువేల గిన్నెల ఓట్‌మీల్ తినాల్సి వచ్చింది.
పైగా తన ఆలోచనను షార్క్ ట్యాంక్ ఐడియాలో పంచుకునేందుకు నాలుగేళ్లుగా దరఖాస్తు చేయగా..చివరకు ఐదో సీజన్‌లో తన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే యష్‌కల్రా తన ఓట్‌మీల్ బ్రాండ్ గోట్‌లైఫ్‌లో 1% యాజమాన్యానికి బదులుగా రూ. 36 లక్షల పెట్టుబడిని ఆశిస్తూ షార్క్ ట్యాంక్ ఇండియాకు వచ్చాడు. అతని ప్రతిపాదన రితేష్ అగర్వాల్, అమిత్‌జైన్, నమిత థాపర్, అమన్‌గుప్తా, అనుపమ్ మిట్టల్‌తో సహా పలువురు షార్క్‌ల దృష్టిని ఆకర్షించింది.
దీనిపై పలు దఫాలు చర్చలు అనంతరం..రితేష్ అగర్వాల్, అమిత్‌జైన్ కంపెనీలో 8% వాటా కోసం రూ. 2 కోట్లు ఆఫర్ చేశారు. అమన్ గుప్తా, అనుపమ మిట్టల్ కూడా ఇదే ఆఫర్ ఇవ్వడం విశేషం. ఒకరకంగా ఆ షో వల్ల యశ్‌కల్రా వ్యాపారం మరింత మందికి చేరువై నెలకు కోటి రూపాయలు ఆర్జించే బ్రాండ్‌గా మారింది. అంతేగాదు సోషల్‌మీడియాలో యశ్‌కు సందేశాలు వెల్లువెత్తాయి.
తన వ్యాపారం పట్ల ఇంతమంది ఆసక్తి చూపడం యశ్‌కి చాలా సంతోషాన్ని ఇచ్చింది అయినాసరే ఆ షో గుర్తింపు పైనే ఆధారపడకుండా మరింతగా వృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు యశ్‌కల్రా. ఇతడి స్టోరీ కష్టపడేవాడు కేవలం మద్దతునే కాదు, తన కష్టాన్ని కూడా వదులుకోడు అని చెబుతోంది కదూ.!
ఇదీ చదవండి: చీరలో కూడా స్మార్టే..! నిజానికి అవి రెండు వేర్వేరు: సుధామూర్తి)


