breaking news
navaratri festival
-
నవరాత్రులకు ముందే జీఎస్టీ కొత్త రేట్లు!
జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. జీఎస్టీ శ్లాబుల సవరణ.. కొత్త పన్ను రేట్లు నవరాత్రి పర్వదినానికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నాటికి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులను అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ పేర్కొంది.కేంద్రం ప్రతిపాదించిన 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు వ్యవస్థల జీఎస్టీ పన్ను శ్లాబులపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్, ఆరోగ్య, జీవిత బీమాపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చించనుంది. రాష్ట్ర మంత్రులతో కూడిన మంత్రుల బృందం (జివోఎం) ఇదివరకే సమావేశమై, రెండు శ్లాబుల జీఎస్టీపై కేంద్రం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత దాదాపు ఐదారు రోజుల తర్వాత జీఎస్టీ కొత్త రేట్ల అమలుపై నోటిఫికేషన్లు వెలువడుతాయని తెలుస్తోంది.రెండే శ్లాబులు.. తక్కువ పన్నులుకేంద్రం 5% (మెరిట్ వస్తువులకు), 18% (స్టాండర్డ్ వస్తువులకు) అనే రెండు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అదనంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక రేట్లు అమలవుతాయి. అల్ట్రా లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్‌పై 40 శాతం, కార్మికాధారిత రంగాలపై 0.1%, 0.3%, 0.5% రాయితీ రేట్లు కొనసాగుతాయి.ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ నిర్మాణంలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబులు ఉన్నాయి. త్వరలో అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ నిర్మాణంలో 12%, 28% శ్లాబులను తొలగించనున్నారు. 5%, 18% శ్లాబుటు మాత్రమే కొనసాగుతాయి. తద్వారా అనేక వస్తువులపై పన్నులు తగ్గి వాటి ధరలు దిగిరానున్నాయి. అయితే రానున్నది పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ కొనుగోళ్లకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్‌కు ముందే కొత్త రేట్లు అమల్లోకి వస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. -
11,888 మంది బాలికలకు కన్య పూజలు
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం ‘శక్తి వందనం’ నిర్వహించారు. కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యాభోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ‘శక్తి వందనం’ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. దేశంలోనే భారీ స్థాయిలో కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేయగా, 11 వేల 11,888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ కూడా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త, సుమారు 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
-
తిరుమల: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం (ఫొటోలు)
-
శారదా నవరాత్రి మరియు సరస్వతి పూజ..!
-
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
నిజామాబాద్ లో నవమాతృకల ప్రతిష్ఠ
-
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
-
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకులు శ్రీకాంత్ గౌడ్, కిరణ్, సంజయ్ జైన్, కైలాష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నగరం వేదికగా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. (చదవండి: సిరి పట్టు చీర న్యూజిల్యాండ్ వెళ్లింది) -
ఇంద్రకీలాద్రి : గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
-
బాలా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
-
కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం
తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా చేసుకున్న అమ్మవారు, స్వామివార్లు కృష్ణానదిలో విహారానికి బయల్దేరారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వైభవంగా మొదలైంది. విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనం మీద స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలకంరించారు. అంతకుముందు విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఆలయం నుంచి కృష్ణానది వరకు ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను వాహనంలో ఉంచి కృష్ణానదిలో విహారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దపెట్టున జయజయధ్వానాలు చేశారు.