11,888 మంది బాలికలకు కన్య పూజలు

Indias Biggest Kanyabhoj Program in Gonda - Sakshi

దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం ‘శక్తి వందనం’ నిర్వహించారు. 

కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యాభోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ‘శక్తి వందనం’ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. 

దేశంలోనే భారీ స్థాయిలో కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేయగా, 11 వేల 11,888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ కూడా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త, సుమారు 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్‌ను ఏర్పాటు చేశారు. 
ఇది కూడా చదవండి:  టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top