అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!

Customer Leaves Rs 8 Lakh Tip On His Dollar 32 Bill Heres Why - Sakshi

మనం రెస్టారెంట్‌కి వెళ్లితే బిల్‌ తోపాటు బాగా సర్వింగ్‌ చేసిన వ్యక్తికి కాస్త టిప్‌ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్‌ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన..

ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్‌లోని మిచిగాన్‌లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కి మార్క్‌ అనే వ్యక్తి బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్‌ ఫాస్ట్‌కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్‌ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్‌ ఈ విషయం మేనేజర్‌కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు.

ఈ మేరకు సదరు రెస్టారెంట్‌ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్‌ మేనేజర్‌ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్‌ టిప్పింగ్‌ కల్చర్‌ సర్వే ప్రకారం..యూఎస్‌లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్‌ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. 

(చదవండి: ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top