చార్లీ చాప్లిన్‌ తొలి సినిమాకు వందేళ్ళు! | Celebrating 100 Years of THE KID | Sakshi
Sakshi News home page

చార్లీ చాప్లిన్‌ తొలి సినిమాకు వందేళ్ళు!

Mar 22 2021 11:18 PM | Updated on Mar 22 2021 11:22 PM

Celebrating 100 Years of THE KID - Sakshi

చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్‌’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్‌’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్‌ చిత్రాల రిస్టోరేషన్‌ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్‌ రష్‌’ ‘సిటీ లైట్స్‌’ ‘ది సర్కస్‌’ ‘మోడ్రన్‌ టైమ్స్‌’ ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ చిత్రాలను 4కె రిస్టోరేషన్‌ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్‌ స్టార్‌డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్‌.

ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్‌మిడ్జ్‌. ఆధునీకరించిన చాప్లిన్‌ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement