కేటీఆర్ దురుసు: సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌, ట్వీట్‌ వైరల్‌

BRS leader ktr tweet here is congress minister Seethakka strong counter - Sakshi

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ మంత్రి  కేటీఆర్‌  వ్యాఖ్యలకు  కాంగ్రెస్‌ మంత్రి సీతక్క స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇచ్చారు.  సుమతీ పద్యాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేసిన నేపథ్యంలో సీతక్క  ట్విటర్‌ ద్వారా స్పందించారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరంటూ ఘాటు విమర్శలు చేశారు.
 

ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది, అసలు మీ కుంటుంబమే  అహంకారానికి బ్రాండ్‌  అంబాసిడర్‌ అంటూ  కేటీఆర్‌పై ధ్వజమెత్తారు సీతక్క.  తెలంగాణా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా, ఇంకా  దొర అహంకారం పోలేదంటూ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ పరోక్షంగా  కామెంట్‌ చేసినప్పటికీ, సీతక్క మాత్రం డైరెక్ట్‌గా కేటీఆర్‌ నుద్దేశించి చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా  పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు  అంటూ  ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి…’ పద్యాన్ని  కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో  పెద్ద దుమారం రేగింది. తెలంగాణా కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి టార్గెట్‌గానే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయవర్గాల్లో చర్చ  జోరుగా నడుస్తోంది.  తాజాగా  దీనికి కౌంటర్‌గా సీతక్క డైరెక్ట్‌ ఎటాక్‌ ట్వీట్ మరింత  కాక పుట్టిస్తోంది. 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top