నాతో కలిసి షికార్లు చెయ్‌.. లేదంటే నీ సంగతి చూస్తా | HR manager booked in Jubilee Hills Police | Sakshi
Sakshi News home page

నాతో కలిసి షికార్లు చెయ్‌.. లేదంటే నీ సంగతి చూస్తా

Jan 31 2026 7:41 AM | Updated on Jan 31 2026 7:41 AM

HR manager booked in Jubilee Hills Police

హైదరాబాద్: నాతో పబ్‌కు రావాలి.. నాతో కలిసి షికార్లు తిరగాలి.. లేదంటే నీ సంగతి చూస్తా అంటూ తోటి  ఉద్యోగిని వేధిస్తున్న హెచ్‌ఆర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ప్రముఖ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వామిరెడ్డి అదే కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగిని తనతో  కలిసి పబ్‌కు రావాలని వేధిస్తున్నాడు. 

కార్యాలయం విధుల్లో భాగంగా ట్రిప్‌కు వెళ్లిన సందర్భంలో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు.  దీనికి యువతి నిరాకరించడంతో ఆమెను డిమోట్‌ చేశాడు. తోటి ఉద్యోగుల వద్ద బాధితురాలి గురించి అసభ్యంగా మాట్లాడుతుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement