Belly Dance: ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ బెల్లీ డ్యాన్స్‌

Britan Woman Has 50 Years Belly-Dance Experience Says Huge Benefits - Sakshi

ఎన్నిరకాల నృత్య ప్రక్రియలు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా బెల్లీడ్యాన్స్‌కు ఉన్న ఆదరణే వేరు! ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు టీనా హోబిన్‌. వయసు 82 ఏళ్లు. బెల్లీడ్యాన్స్‌లో యాభయ్యేళ్ల అనుభవం ఈమె సొంతం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన బెల్లీడ్యాన్సర్‌గా రికార్డు సృష్టించింది.

బ్రిటన్‌కు చెందిన టీనా మొదట్లో సరదాగా బెల్లీ డ్యాన్స్‌ చేస్తూ వచ్చేది. బెల్లీ డ్యాన్స్‌ చరిత్రను పూర్తిగా తెలుసుకున్నాక, ఇదొక పవిత్రమైన కళగా గుర్తించి సాధనలో శ్రద్ధ పెంచి, 1973 నుంచి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ మరుసటి సంవత్సరంలోనే బ్రిటన్‌లోనే తొలి బెల్లీడ్యాన్స్‌ శిక్షకురాలిగా మారి, ఔత్సాహికులకు ఇందులో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. టీనా ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తుండటమే కాకుండా, పదుల సంఖ్యలో విద్యార్థులకు శిక్షణనిస్తోంది.

బెల్లీ డ్యాన్స్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని టీనా చెబుతోంది. ఈ వయసులోనూ తాను ఇంత అందంగా, చురుకుగా ఉండటానికి కారణం బెల్లీ డ్యాన్స్‌ సాధనేనని, బెల్లీ డ్యాన్స్‌ వల్ల వార్ధక్యం తొందరగా మీదపడకుండా ఉంటుందని చెబుతుండటం విశేషం. 

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top