Best Ayurvedic Tips For Black Spots On Face And Skin Pigmentation In Telugu - Sakshi
Sakshi News home page

Best Ayurvedic Tips: గేదె పాలతో ఇలా చేస్తే నెలరోజుల్లోనే మచ్చలు తగ్గుతాయి

Aug 1 2023 4:46 PM | Updated on Aug 1 2023 5:12 PM

Best Ayurvedic Tips For Black Spots On Face And Skin Pigmentation In Telugu - Sakshi

మంగుమచ్చలు.. చాలామందిని వేధించే సమస్య ఇది. ఎండలో తిరగడం వల్ల, వంశపారంపర్యంగా, హార్మోన్లలో సమతుల్యత లోపించడం వంటి వాటి వల్ల ఈ మచ్చలు ఏర్పడుతాయి.

ముఖంపై ఈ నల్లని మంగుమచ్చలు చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తాయి. మరి ఎటువంటి కెమికల్స్‌ వాడకుండానే నేచురల్‌ పద్దతిలో మంచుమచ్చలను ఎలా తొలగించుకోవచ్చు? ఈ సింపుల్‌ టిప్స్‌ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.


► గేదె పాలను చిలికి తీసిన వెన్నను మంగుమచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి
► పచ్చి పసుపు, ఎర్రచందనం కలిపి పాలల్లో నూరి రాస్తే మంగు మచ్చలు తగ్గుతాయి
► జాజికాయను మేకపాలలో అరగదీసి రాయడం వల్ల రిజల్ట్‌ కనిపిస్తుంది
► పాలల్లో ఎర్ర కందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది
► పావు టీ స్పూన్‌ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే నెల రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది.


► టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మచ్చలు తగ్గి శరీర కాంతి మెరుగవుతుంది.
► కలబంద గుజ్జును మచ్చలపై పూయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చలు తగ్గి మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు పూర్తిగా తొలిగిపోతాయి. 
► ఒక టీ స్పూన్‌ టొమాటో రసం, టీ స్పూర్‌ గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తానీ మట్టితో పేస్టులా చేసుకొని మచ్చలపై రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 
► రోజ్‌వాటర్‌, కీరాదోస రసం, నిర్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఒక్క నెలలోనే చక్కటి మార్పు కనిపిస్తుంది.
► ఆలుగడ్డ పొట్ట తీసి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండిరసం తీయాలి. దీన్ని దూదిలో నానబెట్టి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి.

డా.నవీన్ రాయ్,
ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement