భార్యపై ఇంత ప్రేమా..! | Bengaluru Auto Driver Fills His Rickshaw With Late Wifes Photos Goes Viral | Sakshi
Sakshi News home page

భార్యపై ఇంత ప్రేమా..! వీడియో వైరల్‌

Jul 3 2026 2:13 PM | Updated on Jul 3 2026 2:31 PM

Bengaluru Auto Driver Fills His Rickshaw With Late Wifes Photos Goes Viral

ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. 

ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్‌ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్‌ క్రియేటర్‌ ఆశిష్‌ మాథ్యు ఈ వీడియోని షేర్‌ చేశారు. ఆ కంటెంట్‌ క్రియేటర్‌ ఆటోడ్రైవర్‌తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్‌ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. 

అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. 

ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్‌ క్రియేటర్‌ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్‌ జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్‌ చేశాశ్‌ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement