Beauty Tips: బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే.. | Beauty Tips: Homemade Beetroot Aloe Vera Gel Remove Scars On Face | Sakshi
Sakshi News home page

Beetroot Aloe Vera Gel: బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే ఈ క్రీమ్‌ రాసిన తర్వాత..

Sep 14 2022 11:53 AM | Updated on Sep 14 2022 12:39 PM

Beauty Tips: Homemade Beetroot Aloe Vera Gel Remove Scars On Face - Sakshi

బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో తయారు చేసిన క్రీమ్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడమేగాక, అందంగా కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే క్రీమ్‌ కంటే ఇంట్లో తయారు చేసినది మరింత బాగా పనిచేస్తుంది.

►రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసంలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను వేసి జెల్‌లా చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని గాలిచొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి.
►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి.
►ఇప్పుడు బీట్‌రూట్‌ క్రీమ్‌ను ముఖానికి రాసి మర్దన చేయాలి.

►ఈ క్రీమ్‌ రాసిన తరవాత ఇతర క్రీములుగానీ, జెల్స్‌గానీ రాయకూడదు.
►రోజూ క్రమం తప్పకుండా ఈ క్రీమ్‌ అప్లై చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, చిన్నచిన్న పొక్కులు, మచ్చలు తగ్గిపోతాయి.
►అలోవెరా జెల్‌లో తొంభై శాతం నీరు ఉండడం వల్ల చర్మానికి మాయిశ్చర్‌ అందుతుంది.
►ఈ క్రీమ్‌లోని విటమిన్స్, ఖనిజపోషకాలు, సాల్సిలిక్‌ ఆమ్లం, లిగ్నిన్, సపోనిన్, ఎమినో యాసిడ్స్‌ చర్మసమస్యలను తగ్గిస్తాయి.  

చదవండి: Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే!
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement