Bone Strengthening Foods: పిల్లలు, వృద్ధులకు ఖర్జూరాలు తినిపిస్తున్నారా? ఈ డైట్‌ ఫాలో అయితే..

Health Tips: What Food To Eat For Bone Strength In Kids And Old Age People - Sakshi

పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్‌లో చేరిస్తే మంచిది.
పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి.
ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి.
వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి.

ఇవి కూడా...
అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు.

ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్‌ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.
ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట.

చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి?
Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్‌ వల్ల..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top