Health Tips: బోడ కాకర తినేవాళ్లు తప్పక తెలుసుకోండి! దీనిలోని లుటీన్‌ వంటి కెరోటినాయిడ్ల వల్ల..

Health Tips In Telugu: Amazing Benefits Of Aa Kakarakaya Teasel Gourd - Sakshi

చూసేందుకు చిన్నగా... ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆకాకర కాయలు లేదా బోడ కాకర కాయలు కాసింత ఖరీదు ఎక్కువ కావచ్చు. అయితేనేం, ఇవి నోటికి అందించే రుచి, వొంటికి అందించే ఆరోగ్యంతో పోల్చుకుంటే... పెద్ద ఖరీదేం కాదనిపిస్తుంది. ఇంతకీ ఆకాకర ప్రత్యేకత ఏమంటారా?

ఆకాకర కాయల్లోక్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండే ఆకాకరతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలెన్నో... అవేమిటో చూద్దామా?

►వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి ఆకాకర. వీటిని తరచు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.
►సాధారణ కాకర కాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
►ఆకాకరలోని ఫోలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
►ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. 

►దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
►దీనిలో ఉండే లుటీన్‌ వంటి కెరోటినాయిడ్లు వివిధ కంటి వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి.
►విటమిన్‌ సి మూలంగా సహజ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి శరీరంలోని టాక్సిక్‌ ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తుంది, తద్వారా క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
►ఇన్ని ప్రయోజనాలున్న ఆకాకరను ఆహారంలో భాగం చేసుకోవడం మరచిపోరుగా!  
చదవండి: Health Tips: మొక్కజొన్నతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! ముడతలు మాయం! జుట్టుకు బలం.. ఇంకా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top