Health Tips: మొక్కజొన్నతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! ముడతలు మాయం! జుట్టుకు బలం.. ఇంకా

Health Tips In Telugu: Surprising Benefits Of Corn For Health Skin Hair - Sakshi

మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు.  ముసురు పట్టినప్పుడు మొక్కజొన్న కండె కాల్చుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. మెుక్కజొన్న గింజల నుంచి పాప్‌కార్న్, కార్న్‌ ఫ్లేక్స్‌ తయారుచేస్తారు.

మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. అవేమిటో చూద్దామా..?

మంచి చిరుతిండి
►మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినచ్చు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చితే సాయంకాలం వేళ మంచి చిరుతిండి.  

►మెుక్కజొన్నలో లినోలిక్‌ ఆసిడ్, విటమిన్‌ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్‌ ఆసిడ్, రైబోఫ్లోవిన్‌ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
►మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ చెబుతోంది.

ఎముకలకు బలం
►పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుంది. పేగుకేన్సర్‌ను అరికడుతుంది. 
►ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్‌ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. 
►పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్‌ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది.
►కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. 

చర్మం ఆరోగ్యంగా.. అందంగా.
►మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు... శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి.
►మెుక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్‌ యాసిడ్‌ చర్మం మీద వచ్చే మంటలను, దద్దుర్లను తగ్గిస్తుంది. 

ఎర్ర రక్తకణాల వృద్ధి
►రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న అద్భుతమైన వరం.
►మెుక్కజొన్నలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. 

గుండె ఆరోగ్యం పదిలం
►మొక్కజొన్న రక్తకణాల్లో కొవ్వుస్థాయులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
►రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది. 

జుట్టుకు బలం
►రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్‌ సి జుట్టును పట్టులా మృదువుగా... మెరుపులీనేలా చేస్తుంది. 
►మొక్కజొన్న తక్షణశక్తిని ఇచ్చే ఆహారం. దీనిని తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు, పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉన్నాయి.

సరైన ఆహారం
►మొక్కజొన్న తరచు తినడం వల్ల హైపర్‌ టెన్షన్‌ కూడా దూరం అవుతుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. 
►అందుకే వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు.  

చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త!
Tips To Increase Platelet Count: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top