Beauty Tips: చేయంత యంత్రం..ముఖమంతా మెరుపు..! | Beauty tips: Fully Automatic EMS Rf Face Muscle Lifting Machine | Sakshi
Sakshi News home page

చేయంత యంత్రం..ముఖమంతా మెరుపు..!

Jun 29 2025 1:05 PM | Updated on Jun 29 2025 5:14 PM

Beauty tips: Fully Automatic EMS Rf Face Muscle Lifting Machine

అందమైన, కాంతిమంతమైన చర్మం కోసం ఇప్పుడు బ్యూటీ సెలూన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ బ్రూనో ఈఎమ్‌ఎస్‌ ఫేషియల్‌ లిఫ్ట్‌ పరికరం, ఇంట్లోనే సౌకర్యవంతంగా, పూర్తి స్థాయి చర్మ సంరక్షణను అందిస్తుంది. అందం కోసం ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్‌ మజిల్‌ స్టిమ్యులేషన్‌ పద్ధతికి ఆధునిక హంగులు దిద్ది, ఈ పరికరం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ డివైస్‌ నాలుగు ప్రత్యేకమైన ఆప్షన్స్‌ని కలిగి ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్‌ మజిల్‌ స్టిమ్యులేషన్‌ ఆప్షన్‌ ముఖ కండరాలను ఉత్తేజపరచి, చర్మాన్ని బిగుతుగా చేసి, ముడతలను తగ్గిస్తుంది. అలాగే దీనిలోని హాట్‌ అండ్‌ కోల్డ్‌ ఫంక్షన్‌ చల్లని రోజుల్లో చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి, వేడి రోజుల్లో చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బూస్టర్‌ ఫంక్షన్‌ సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి లోతుగా ఇంకేలా చేసి, వాటి ప్రభావాన్ని పెంచుతుంది. 

మరోవైపు దీనిలోని అల్ట్రాసోనిక్‌ వైబ్రేషన్‌ చర్మాన్ని మరింత బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కేవలం ముఖానికే కాకుండా, మెడ, చేతులు, కాళ్ళపై కూడా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు. సుమారు 183 గ్రాముల బరువుతో, స్టాండ్, స్టోరేజ్‌ బ్యాగ్‌తో లభిస్తుంది. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని ‘త్రీ మినిట్స్‌ ఆటో పవర్‌–ఆఫ్‌’ ఫీచర్‌ వల్ల సురక్షితంగా దీనిని వాడుకోవచ్చు.

సెల్యులైట్‌కు శాశ్వత పరిష్కారం!
ఎందరో మహిళలను వేధించే సాధారణ సమస్య సెల్యులైట్‌. తొడలు, పిరుదులపై చర్మం గుంతలు పడినట్లు, నారింజ తొక్కలా వడిలిపోయినట్లుగా కనిపించడమే సెల్యులైట్‌ లక్షణాలు. సెల్యులైట్‌కు అసలు కారణం చర్మంలోని కొవ్వు కణజాలం కింద ఉండే ఫైబ్రస్‌ బ్యాండ్‌లు. ఇవి చర్మాన్ని లోపలికి లాగడం వల్ల గుంతలు ఏర్పడతాయి. 

ఆహారపు అలవాట్లతో, వ్యాయామాలతో తగ్గని ఈ సమస్యకు ఆధునిక పరిష్కారం సెల్ఫినా చికిత్స. నిపుణులు సన్నటి సూదిలాంటి పరికరాన్ని ఉపయోగించి ఫైబ్రస్‌ బ్యాండ్‌లను కత్తిరించి, వాటి ఒత్తిడిని తొలగిస్తారు. బ్యాండ్‌లు విడుదలైన వెంటనే, చర్మం మళ్లీ నునుపుగా మారుతుంది. కొన్నిసార్లు స్వల్పంగా నొప్పి, వాపు, గాయాలు ఉండవచ్చు, కాని, అవన్నీ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. 

(చదవండి: వాల్‌నట్స్‌ షెల్స్‌తో వైట్‌ హెయిర్‌కి చెక్‌పెడదాం ఇలా..!)

Advertisement
 
Advertisement
Advertisement