టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!

Ayurveda Experts Says Drinking Warm Tea Or Water With Honey Can Be Harmful For Your Health - Sakshi

ప్రకృతి సిద్ధంగా దొరికే తేనె.. ఇంటివైద్యం మొదలుకొని ఆయుర్వేదం వరకు రకరకాల సమస్యల నివారణకు వాడుకలో ఉన్నదే. ప్రకృతి ప్రసాదమేకదా! అని ఎట్లాపడితే అట్లా వాడితో ఔషధం విషంగా మారుతుంది. అవును!!

చాలా మంది పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. సాధారణంగా ఈ ప్రక్రియను శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందనే నమ్మకంతో అనుసరిస్తారు. సహజంగానే తీపి గుణం కలిగిన ప్రకృతి సిద్ధమైన తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మాగ్నిషియం, కాపర్‌, మాంగనీస్‌, పొటాషియం, జింక్‌ వంటి మినరల్స్‌, ఎన్‌జైమ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

తీపికి ప్రత్నామ్నాయంగా డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు కూడా ముడి తేనె ఉపయోగంలో ఉంది. అంతేకాక ఇది దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుంది కూడా.  ఇంతటి సుగుణాలు ఉన్న తేనెను హెర్బల్‌ టీ, లెమన్‌ టీ, వేడి పాలు.. వంటి ఏ రకమైన వేడిపదార్ధాలతోనైనా కలిపి తాగడం ఆయుర్వేదం ప్రకారం ప్రమాదమని ప్రముఖ ఆయుర్వేద ఎక్స్‌పర్ట్‌ డా. రేఖా రాధామణి హెచ్చరిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకుందాం..

చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!

►తేనెను వేడిగా తీసుకుంటే అది శరీరంలో స్లో పాయిజన్‌గా మారుతుంది. ఒక్కసారి దీనిని వేడిగా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరంలో హానికారక విషాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరంలో క్రమంగా పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. 

►ముడి తేనెలో పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి. దీనిని అలాగే నేరుగా వినియోగించాలి. ఐతే స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో ఆర్టిఫిషియల్‌ స్వీట్నర్‌, కార్న్‌ (మొక్కజొన్న) సిరప్ వంటివి తీపి కోసం కలుపుతారు. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు కూడా దీనిలో ఉండవు. 

►అంతేకాకుండా సూపర్‌ మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అటువంటి తేనెను కొనకపోవడం మంచిది. వాడకపోవడం ఇంకా మంచిది.

తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని డాక్టర్ రాధామణి సూచిస్తున్నారు.

చదవండి: మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్‌, అలర్జీ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top