మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్‌, అలర్జీ..

You Must Know These Side Effects Before Drinking Almond Milk - Sakshi

బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ ‘ఇ’, మాగ్నిషియం, మాంగనీస్‌, కాపర్‌, పాస్పరస్‌.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు పుష్టి, బరువు అదుపులో ఉంచడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం.. వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే బాదం పాలల్లో కూడా పోషకాలు తక్కువేం కాదు. ఐతే మితిమీరి తీసుకుంటే అలర్జీల రూపంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

కడుపులో వికారం
బాదం అధికంగా తీసుకుంటే వీటిల్లోని మినరల్స్‌, నూట్రియన్స్‌ అవసరానికి మించడం వల్ల వాంతికి రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం.. వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన జీర్ణాశయాంతర ప్రతిచర్యలకు దారితీస్తుంది.

చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..

గింజల అలర్జీ
నట్స్‌ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్జోస్‌ అలర్జీలున్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉండటమే మేలు.

షుగర్‌ స్థాయిలు ఎక్కువ
ఆవుపాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది ​కూడా అరోగ్యానికి హానికారకమే.

థైరాయిడ్‌పై ప్రభావం
బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే ఈ విధమైప ఆహారాలు థైరాయిడ్‌ సమస్య తలెత్తడానికి కారణమవుతాయన్నమాట. వీటిని అధికమోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు బాదం పప్పు లేదా బాదం పాలు మితంగా తీసుకుంటే బెటర్‌!

పిల్లలకవసరమైన పోషకాలు అందవు
బాదం పాలు పిల్లలకు కూడా అంత మేలు చేసేదేంకాదు. పిల్లలకు అవసరమైన సరైన పోషకాలు కూడా దీనిలో అంతగా ఉండవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మాత్రం వీటిని అస్సలు పిల్లలకు పట్టించకూడదు.

కాబట్టి బాదం పాలు తాగే ముందు ఓ సారి ఆలోచించి తాగితే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.

చదవండి: World Mental Health Day: డార్క్‌ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top