అట్లాంటిక్‌ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! | Atlantic Diet Is The Healthiest Diet In The World | Sakshi
Sakshi News home page

అట్లాంటిక్‌ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

Feb 19 2024 5:48 PM | Updated on Feb 19 2024 6:02 PM

Atlantic Diet Is The Healthiest Diet In The World - Sakshi

ఇప్పుడు వెజిటేరియన్‌ డైట్‌ అని, ఫ్రూట్‌ జ్యూస్‌ డైట్‌ అని పలు రకాల డైట్‌లు వచ్చేశాయి. తమ ఆహార్యానికి తగ్గట్టుగా వారికి నచ్చిన డైట్‌ని ఫాలో అవుతున్నారు. ఇటీవల బాగా సోషల్‌ మీడియాలో అట్లాంటిక్‌ డైట్‌ అని ఓ డైట్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ డైట్‌ ఫాలో అయితే కేవలం బరువు మాత్రమే అదుపులో ఉండటమే గాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అత్యంత ఆరోగ్యకరమైన డైట్‌లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ఏంటా డైట్‌ అంటే..

ఈ అట్లాంటిక్‌ డైట్‌ మెడిటేరియన్‌ డైట్‌ని పోలి ఉంటుంది. ఇది యూరప్‌లో బాగా ఫేమస్‌ అయ్యిన డైట్‌. ఇది బరువుని అదుపులో ఉంచడమే గాక శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరునెలల పాటు ఈ డైట్‌ ఫాలో అయితే గొప్ప ‍ప్రయోజనాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ స్థాయిల తోపాటు రక్తపోటు, గ్లూకోజ్‌ స్థాయిలను సమతుల్య స్థాయిలో ఉండేట్లు చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు 200 స్పానిష్‌ కుటుంబాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యిందlన్నారు. 

ఈ డైట్‌లో ఏం ఉంటాయంటే..
ఈ డైట్‌లో పోర్చుగల్‌, వాయువ్య స్పెయిన్‌లో ప్రసిద్ధి చెందిన ఆహారాలు ఉంటాయి. దీనిని దక్షిణ యూరోపియన్‌ డైట్‌ అని కూడా అంటారు. ఐరోపాలో జరిపిన పలు అధ్యయనాల్లో ఈ డైట్‌ వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ఇందులో క్యాన్సర్ లేదా గుండె జబ్బుల నుంచి ముందుగానే చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, స్ట్రోక్ ,ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచే వేలాడే పొట్ట కొవ్వుని కూడా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఈ డైట్‌లో ఉండే ఆహారాలు..

  • తాజా చేప 
  • కొద్దిగా ఎర్ర మాంసం ఉత్పత్తులు
  • పాలు
  • చిక్కుళ్ళు
  • తాజా కూరగాయలు
  • బంగాళదుంపలు
  • గోధమ బ్రెడ్
  • కొద్ది మోతాదులో వైన్ 
  • ఆకుకూరలు

ఈ డైట్‌లె మాంసం, చేపలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒమెగా 3కి సంబంధించిన కొవ్వు ఆధారిత చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని చాలావరకు కుటుంబసభ్యులంతా కలిసి ప్రిపేర్‌ చేసుకుని ఉత్సాహ భరితంగా ఆస్వాదిస్తారు. దీంతోపాటు రోజువారీ నడక, సైక్లింగ్‌ తప్పనిసరి ఉంటాయి. 

ప్రయోజనాలు..

  • మెటబాలిక్ సిండ్రోమ్‌ను తగ్గిస్తుంది
  • జబ్బులు, మధుమేహం, స్ట్రోక్  వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
  • ఊబకాయం వంటివి రావు
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • చెడు కొలస్ట్రాల్‌ని దరిచేరనీయ్యదు
  • బరువు అదుపులో ఉంటుంది
  • అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడగలుగుతారు.

మూడేళ్లకు అట్లాంటిక్‌ డైట్‌కు కట్టుబడి ఉంటే 60 ఏళ్ల పైబడిన పెద్దల్లో ముందస్తుగా మరణించే ప్రమాదాలు 14% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది బెస్ట్‌ డైట్‌. 

(చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement