రాఘవ్‌ చద్దా కంటి అపరేషన్‌: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా? | App MP Raghav Chadha Surgery What Is Vitrectomy | Sakshi
Sakshi News home page

రాఘవ్‌ చద్దా కంటి అపరేషన్‌: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?

May 2 2024 1:38 PM | Updated on May 2 2024 4:41 PM

App MP Raghav Chadha Surgery What Is Vitrectomy

పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.


రాఘవ్‌ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్‌ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ,  శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్‌ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.

విట్రెక్టమీ అంటే ఏమిటి?

జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్‌)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ,  గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని  భర్తీ చేస్తారు.

మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్‌మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్‌లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు.  ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా,  చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.

కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి,  మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.

విట్రెక్టమీ: ప్రమాదమా?
విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్‌మెంట్‌లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్‌ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్  చేస్తారు. లోకల్‌ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని  ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో  23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్‌సిషన్ సర్జరీ)  ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.

విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల  మాదిరిగానే రోగి  వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి  సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది.

 సైడ్‌ ఎఫెక్ట్స్‌
ఇన్ఫెక్షన్ రావచ్చు
అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం
కంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.
శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్‌మెంట్‌ సమస్య
కంటి లెన్స్ దెబ్బతినడం
కంటిశుక్లం ఏర్పడే అవకాశం
శస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులు
వక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్‌  అవసరం)
ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. 

కాగా హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్‌ మూవీ  అమర్ సింగ్ చమ్కిలా   ప్రమోషన్‌లో బిజీగా ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement