చీరకట్టులో మెరిసిపోతున్న అనసూయ! ఎప్పుడు ఒకేరకమైన ఆహారం తినలేం కదా! | Anasuya Bharadwaj Stuns In Orange Ruffle Saree Brand Price Details | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ

Feb 6 2023 11:22 AM | Updated on Feb 6 2023 11:50 AM

Anasuya Bharadwaj Stuns In Orange Ruffle Saree Brand Price Details - Sakshi

అనసూయ భరద్వాజ్‌ (PC: Instagram)

అనసూయ భరద్వాజ్‌.. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ తన మీద తెలుగు ప్రేక్షకులకున్న అభిమానాన్ని రెట్టింపు చేసుకుంటోంది. ఫ్యాషన్‌లోనూ అంతే.. ట్రెండ్‌కు తగ్గ  కట్టు, బొట్టు తీరుతో తన అభిమానుల ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తుంటుంది.

కౌశికి కల్చర్‌
హైదరాబాద్‌కు చెందిన కౌశికి.. సెలబ్రిటీస్‌కి ఫేవరెట్‌ డిజైనర్‌. తన పేరు మీదే ఫ్యాషన్‌  లేబుల్‌ను క్రియేట్‌ చేసుకుంది. పట్టు పావడాలకు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళను ఆధునిక డిజైన్స్‌తో పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేస్తుంది. మన్నికైన ఫాబ్రికే ఈ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లో లభ్యం.

హౌస్‌ ఆఫ్‌ క్యూసీ
2016లో ఒక వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభించిన వ్యాపారం, తమ అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా నోటెడ్‌ అయింది. ఎలాంటి వారికైనా నప్పే, ఎలాంటి వారైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్‌ ఆఫ్‌ క్యూసీ’ జ్యూయెల్స్‌ ప్రత్యేకత. హైదరాబాద్, బెంగళూరులలో ఈ మధ్యనే స్టోర్స్‌ ఓపెన్‌ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కూడా ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర.

బ్రాండ్‌ వాల్యూ 
జ్యూయెలరీ
బ్రాండ్‌:  హౌస్‌ ఆఫ్‌ క్యూసీ జ్యూయెల్స్‌
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

చీర
బ్రాండ్‌:  కౌశికి కల్చర్‌
ధర: రూ. 11,000

ఫ్యాషన్‌ అనేది మన తిండి అలవాటులా ఉండాలి. ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం. అలాగే ఎప్పుడు ఒకే రకం బట్టలనూ ధరించలేం. – అనసూయ భరద్వాజ్‌ 
-దీపిక కొండి

చదవండి: పెళ్లికళకు పరిపూర్ణత
Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement