Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో..

West Bengal Sreyashi Raka Das Fashion Blogger Inspirational Journey - Sakshi

Sreyashi Raka Das: పశ్చిమబెంగాల్‌ లోని చిన్న పట్టణానికి చెందిన శ్రేయసి రక దాస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. శ్రేయసి ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకోలేదు. శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి ప్రకృతి నుంచే పాఠాలు, ‘వర్ణ’మాల నేర్చుకుంది. ఫ్యాషన్‌ బ్లాగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రేయసి ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకుంది.

తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. శ్రేయసి క్రియేటివ్‌ ఐడియాలు పెద్ద బ్రాండ్‌లకు నచ్చి అవకాశం ఇచ్చాయి. ఇక వెనక్కి తిరిగిచూసుకోలేదు.‘ఎస్‌ఆర్‌డీ’ లేబుల్‌తో తానే ఒక బ్రాండ్‌గా ఎదిగింది. కొరియన్‌ యూట్యూబర్‌ లునా యోగినితో కలిసి చేసిన ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చింది. ‘ఎస్‌ఆర్‌డీ’ వింటర్‌ కలెక్షన్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ దక్కింది.

ఇప్పుడు తన దగ్గర ప్రతిభావంతులైన యువబృందం ఉంది. అందరూ కలిసి కొత్తరకం డిజైన్‌ల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తారు. ‘సమ్‌థింగ్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌’ అనేది ఎన్‌ఆర్‌డీ అందమైన నినాదం.

‘మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు, ఇతరులలోని ప్రతిభను అభినందించగలిగినప్పుడు అసలుసిసలైన అందం మన కంటికి కనిపిస్తుంది. అప్పుడే అందమైన ఐడియాలు వస్తాయి’ అంటున్న శ్రేయసికి వ్యాపార ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యత కాదు. 26 సంవత్సరాల శ్రేయసికి సామాజిక స్పృహతో పాటు పర్యావరణ స్పృహ కూడా ఉంది. 

చదవండి: Sustainable Fashion: చమురుతో కంటే.. పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్‌ ఫ్యాషన్‌ వల్లే ఎక్కువ కలుషితం! ఏం చేయాలి?

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top