ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం.. | American Billionaire Bryan Johnson Takes 111 Pills And Spends 16 Crore - Sakshi
Sakshi News home page

ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..

Published Wed, Sep 27 2023 3:54 PM

American Millionaire Bryan Johnson Takes 111 Pills Spends 16 Crores - Sakshi

యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్‌ దాన్ని సఫలం​ చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్‌ అవుతారు.

మల మూత్ర విసర్జనలు సైతం..
వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన టెక్‌ మిలీనియర్‌ బ్రయాన్స్‌ జాన్సన్‌కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్‌ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్‌ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. 

అలాగే ప్రతి రోజు బేస్‌ బాల్‌ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్‌ చేసి దాన్ని రిపేర్‌చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్‌ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్‌ తన ప్రాసెసింగ్‌ కంపెనీ బ్రెయిన్‌ ట్రీ సొల్యూషన్స్‌ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్‌ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్‌గా మారాడు.


జాన్సన్‌(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్‌ ఫోటో

యాక్సిడెంట్‌ కాకూడదని..
ఇక జాన్సన్‌కి సడెన్‌గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్‌ఏంజిల్స్‌ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్‌ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్‌ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్‌ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డ​బ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని.

ప్రాజెక్ట్‌ బ్లూప్రింట్‌తో..
మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్‌లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్‌ పెరుగుతుందో చెక్‌ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్‌మెంట్‌ వెంటనే అందిస్తారట జాన్సన్‌కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్‌ అనే ప్రాజెక్ట్‌తో జాన్సన్‌ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్‌ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అంతేగాదు జాన్సన్‌ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్‌ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్‌ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. 

(చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్‌ విషయాలు)

Advertisement
Advertisement