Smart Bottle: ఈ బాటిల్‌ కేవలం నీళ్లకే కాదు.. మ్యూజిక్‌ కూడా.. ధర రూ.3,257 | 3 In 1 Smart Insulated Water Bottle How It Works And Price Details | Sakshi
Sakshi News home page

Smart Bottle: ఈ బాటిల్‌ కేవలం నీళ్లకే కాదు.. మ్యూజిక్‌ కూడా.. ధర రూ.3,257

May 31 2022 4:16 PM | Updated on May 31 2022 4:24 PM

3 In 1 Smart Insulated Water Bottle How It Works And Price Details - Sakshi

ప్రతి ప్రయాణంలో మంచి నీళ్లు ఎంత అవసరమో.. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాల్లో ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్మెంట్‌ కూడా అంతే అవసరం. 3 ఇన్‌ 1 స్మార్ట్‌ ఇన్సులేటెడ్‌ వాటర్‌ బాటిల్‌ అందుకు సై అంటుంది. ఒక వాటర్‌ బాటిల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని అందించడమేంటీ అనేగా మీ డౌటనుమానం? అదే దీని స్పెషాలిటీ. దీనిలో మ్యూజిక్‌ స్పీకర్స్, డాన్సింగ్‌ లైట్స్‌ ఆన్‌ చేసుకోవచ్చు.

వేడి నీళ్లు కావాలంటే వేడి నీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లూ ఇందులో  నిలవ చేసుకోవచ్చు. 12 గంటల పాటు వేడి నీళ్లను వేడిగా, 24 గంటల పాటు చన్నీళ్లను చల్లగా ఉంచుతుంది. వైర్‌ లెస్‌ పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ ఉండటంతో.. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కి కనెక్ట్‌ చేసుకుని నచ్చిన పాటను పెట్టుకోవచ్చు.

ఈ బాటిల్‌ని పార్టీల్లో, యోగా చేసే సమయాల్లో, వ్యాయామం చేసేటప్పుడు, క్యాంపింగ్‌ లేదా అవుట్‌ డోర్‌కి వెళ్లినప్పుడు వెంట పెట్టుకుంటే.. చక్కగా కావల్సిన మ్యూజిక్‌ వింటూ దాహం తీర్చుకోవచ్చు. ఇలాంటి బాటిల్‌ని మన సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. ఆరోగ్య స్పృహ ఉన్న ఆత్మీయులకు ఇలాంటి బాటిల్‌ బహుమతిగా ఇవ్వడం కూడా బాగుంటుంది.
ధర: 42 డాలర్లు (రూ.3,257)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement