
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్‌నెస్‌కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్‌కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.
ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్‌లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్‌లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్‌గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్‌గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది.
డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్‌ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్‌ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: