క్షేత్ర రహదారి.. ప్రమాదంగా మారి..! | - | Sakshi
Sakshi News home page

క్షేత్ర రహదారి.. ప్రమాదంగా మారి..!

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

ఆహ్లాదం.. కార్తీక విహారం 8లో u

న్యూస్‌రీల్‌

శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు క్షేత్రానికి చేరక ముందే క్షతగాత్రులై ఆస్పత్రుల పాలవుతున్నారు. గోతుల రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

కార్తీకమాసంలో ప్రజలు ఆధ్యాత్మికతోపాటు పర్యాటకానికీ ఆసక్తి చూపుతారు. జిల్లాలో పలు ఆహ్లాదకర ప్రదేశాలు ఉన్నాయి.

గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. భీమడోలు–ద్వారకాతిరుమల మధ్య సుమారు 17 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డుపై అడుగడుగునా గోతులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు వీధి దీపాలు లేకపోవడంతో రాత్రిళ్లు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. చీకట్లో గోతులు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడుతున్నారు.

దర్శనానికి వస్తూ.. ప్రమాదాల బారిన పడుతూ!

వేకువజామున స్వామివారిని దర్శించుకోవాలనే సంకల్పంతో కొందరు భక్తులు ముందు రోజు రాత్రే ద్విచక్ర వాహనాలపై క్షేత్రానికి బయలుదేరుతున్నారు. అయితే రహదారిపై ఏర్పడిన భారీ గో తులు చీకట్లో కనిపించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి ఏలూరు నుంచి స్కూటీపై శ్రీవారి దర్శనానికి వస్తున్న ఎం.పద్మ, ఎం.రాజేశ్వరి అనే భక్తులు ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద గోతిలో పడి తీవ్రంగా గాయపడ్డారు. పద్మ కాలికి, రాజేశ్వరి ముఖానికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

అడుగడుగునా డేంజర్‌ జోన్లు

ఈ మార్గంలో పలు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ద్వారకాతిరుమలలో టీటీడీ సదనం ఎదురుగా, కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలోని మలుపు, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు ముందు, లక్ష్మీపురం టైల్స్‌ ఫ్యాక్టరీ వద్ద, జగన్నాథస్వామి ఆలయం ఆర్చిగేటు, గొల్లగూడెం చెరువు, సూర్యచంద్రరావుపేట చెరువు వద్ద, పంగిడిగూడెం హైస్కూల్‌ ఎదురుగా, ఆ గ్రామ శివారులో.. కుమారీ దాబా సమీపంలో, పొలసానిపల్లి గురుకుల పాఠశాల ఎదురుగా రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వీటిలో సూర్యచంద్రరావుపేట చెరువు, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

స్థానికులే అప్రమత్తం చేస్తూ.. లక్ష్మీపురం టైల్స్‌ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై ఏర్పడిన భారీ గోతుల వద్ద స్థానికులే బారికేడ్‌ ఏర్పాటు చేశారు. ద్వారకాతిరుమల టీటీడీ సదనం ఎదురుగా ఉన్న గోతిలో డ్రమ్ము పెట్టి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. స్థానికులే హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. రహదారి నిర్మించి పుష్కర కాలం కావస్తున్నా స్ట్రీట్‌ లైట్లు ఏర్పాటు చేయకపోవడం, గోతులు ఏర్పడిన చోట శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగించే క్షేత్ర మార్గంపై పాలకులు, అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద దెబ్బతిన్న రహదారి

లక్ష్మీపురం శివారులో టైల్స్‌ ఫ్యాక్టరీ వద్ద..

ప్రయాణం గోవిందా ?

భీమడోలు–ద్వారకాతిరుమల మార్గంలో నిత్యం ప్రమాదాలు

క్షేత్రానికి చేరక ముందే ఆస్పత్రుల పాలవుతున్న భక్తులు

కనీస మరమ్మతులకు నోచుకోని రహదారి

ఏళ్లు గడుస్తున్నా ఏర్పాటుకాని వీధి దీపాలు

పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement