● ఎమ్మెల్యే కామినేని చేసేవన్నీ మోసాలే..
● స్థానిక ఎన్నికల్లో కూటమికిభారీగా తగ్గిన మెజార్టీ
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ధర్మపోరాటం చేస్తే, కూటమి దొడ్డిదారిన విజ యాలు సాధించుకుందని, ప్రజల్లో నమ్మకం లేదనడానికి ఇదే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) దుయ్యబట్టారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బు ధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు నియోజకవర్గంలో 45 వేల ఓట్ల మెజార్టీ రాగా.. తాజాగా జెట్పీటీసీ ఎన్నికల్లో నాలుగు మండలాల్లో 16 వేల ఓట్లకు కూటమి దిగజారిందన్నారు. ప్రజల్లో కూటమి పాలనపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమ న్నారు. కై కలూరు మండలం ఆచవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపును కూటమి నేతలు ఒక్క ఓ టుతో లాక్కోవడం విజయమేనా అన్ని ప్రశ్నించా రు. ఎమ్మెల్యే కామినేని ఆదేశాలతో సజ్జా బాబీ అనే వ్యక్తి తప్పతాగి కై కలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రౌడిమూకలతో దాడి చేశారని ఆరోపించారు. ఇందుకు పోలీసులు సాక్షులుగా ఉన్నారని, వీడియోలు కూడా ఉన్నాయన్నారు. కేసు పెట్టమని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియాక్షన్ ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో అవినీతి సొమ్ము ఖర్చు చేశారని కామినేని చెబుతున్నారని, ఆయన ఈ ఎన్నికల్లో ఎవరి సొమ్ము ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రోవెల్ ఫ్యాక్టరీలో రూ.49 కోట్ల వ్యాపారుల లెక్కలు తేలాల్సి ఉందన్నారు. అలాగే కై కలూరులో జాగృతి చిట్‌ఫండ్ పేరుతో 326 మందికి రూ.కోట్లు ఎగనామం పెట్టారన్నారు. బాధితుల పక్షాన కాకుండా మోసగాళ్లకు కామినేని అండగా ఉంటున్నారని విమర్శించారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. పిల్ల రౌడీలు, పేకాట క్లబ్‌లు, మట్టి మాఫియాకు కై కలూరు అడ్డాగా మారిందన్నారు. ఎమ్మెల్యే కామినేని పెత్తందారులకు కొమ్ముకాస్తే, తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని సామాజికవర్గాలతో కలసి పనిచేస్తున్నానన్నారు. ఇకపై కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ కై కలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, రాష్ట్ర ముదిరాజుల విభాగ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, జెడ్పీటీసీగా పోటీచేసిన రామిశెట్టి సత్యనారాయణ, జయమంగళ కాసులు, కూసనపూడి కనకదుర్గారాణి, నాయకులు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఘంటా సంధ్య, నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.


