● అటకెక్కిన ఫిష్ ఆంధ్ర పథకం
● నిరుపయోగంగా అవుట్‌లెట్లు
కొయ్యలగూడెం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర పథకంపై నీలినీడలు అలముకున్నాయి. ఈ పథకం కింద నిర్మించిన అవుట్‌లెట్లు నేడు క్షేత్రస్థాయిలో అటకెక్కడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2022లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.330 కోట్ల వ్యయంతో 70 ఆక్వా హబ్‌లు, 14,000 పైగా మినీ/మైక్రో రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసి, 80,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక రూపొందించారు.
సబ్సిడీపై రుణాలు
ప్రతి అవుట్‌లెట్‌కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వ్యయంలో సాధారణ అభ్యర్థులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా లబ్ధిదారులకు 60 శాతం సబ్సి డీ అందించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణాల రూపంలో సమకూర్చాయి. డిజిటల్ లావాదేవీల కోసం పేటీఎం వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.
అవుట్‌లెట్లు మూతపడుతూ..
అయితే, 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చా లా దుకాణాలు మూతపడ్డాయి. ఆక్వా హబ్‌ల నుంచి నేరుగా చేపల సరఫరా లేకపోవడం, బయటి మార్కెట్లలో కొనుగోలు వల్ల పెట్టుబడి భారం పెరగడం, డీప్ ఫ్రీజర్లు లేకపోవడం, ఉచిత లేదా రా యితీ విద్యుత్ సౌకర్యం లభించకపోవడం వంటి స మస్యల వల్ల లబ్ధిదారులు నష్టపోయి బ్యాంకు రు ణాలు చెల్లించలేకపోయారు. ప్రస్తుతం ఈ దు కాణాలు చెత్తాచెదారం, పాత సామాన్లతో నిండి నిరుపయోగంగా మారాయి.
పునరుద్ధరించాలని వినతి
ప్రజాధనం వృథా కాకుండా ఉండాలంటే మత్స్య శాఖ తక్షణమే ప్రత్యేక సర్వే నిర్వహించాలి. బ్యాంకర్లతో చర్చించి రుణాలను పునర్వ్యవస్థీకరించడం, వడ్డీ రాయితీలు ఇవ్వడం, ఉచిత/రాయితీ విద్యుత్ అందించడం తక్షణ అవసరం. అలాగే, నిర్వహించలేని వారి స్థానంలో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు లేదా నిరుద్యోగ యువతకు వీటిని అప్పగించి, ఆక్వా రైతులతో నేరుగా అనుసంధానం చేయాలి. ఈ అవుట్‌లెట్లను ఆధునీకరించి మళ్లీ వినియోగంలోకి తెచ్చి స్థానిక ఉపాధిని పు నరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.


