ఏలూరు (టూటౌన్): జిల్లాలోని 544 గ్రామ పంచాయతీలకు నవంబర్ 15 నుండి డిసెంబర్ 3 వరకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని 544 గ్రామ పంచాయతీల్లోని 5,696 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనుండగా, ఇందుకోసం 5,821 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● మొదటి విడత
మండలాలు: బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి. నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం.
పంచాయతీలు/వార్డులు: 177 పంచాయతీలు, 1,896 వార్డులు (1,953 పోలింగ్ స్టేషన్లు).
షెడ్యూల్: నవంబర్ 15న నోటిఫికేషన్, 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న అప్పీళ్లు, 20లోగా పరిష్కారం, 21న ఉపసంహరణ, తుది జాబితా. నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఫలితాలు (అవసరమైతే 27న రీపోలింగ్).
● రెండో విడత
మండలాలు: భీమడోలు, కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల.
పంచాయతీలు/వార్డులు: 194 పంచాయతీలు, 1,972 వార్డులు (2,024 పోలింగ్ స్టేషన్లు).
షెడ్యూల్: నవంబర్ 18న నోటిఫికేషన్, 20 వరకు నామినేషన్లు, 21న పరిశీలన, 22న అప్పీళ్లు, 23 లోపు పరిష్కారం, 24న ఉపసంహరణ, తుది జాబితా. నవంబర్ 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు (అవసరమైతే 30న రీపోలింగ్).
● మూడో విడత
మండలాలు: దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు.
పంచాయతీలు/వార్డులు: 173 పంచాయతీలు, 1,828 వార్డులు (1,844 పోలింగ్ స్టేషన్లు).
షెడ్యూల్: నవంబర్ 21న నోటిఫికేషన్, 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 25న అప్పీళ్లు, 26లోగా పరిష్కారం, 27న ఉపసంహరణ, తుది జాబితా. డిసెంబర్ 2న పోలింగ్, అదే రోజు ఫలితాలు (అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్).


