కార్తీక మాస ఏర్పాట్లపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్తీక మాస ఏర్పాట్లపై నిర్లక్ష్యం

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

కార్తీక మాస ఏర్పాట్లపై నిర్లక్ష్యం కొల్లేరుపై పూర్తి సమాచారాన్ని అందించాలి

పాలకొల్లు పంచారామక్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస ఏర్పాట్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 8లో u
కొల్లేరుపై పూర్తి సమాచారాన్ని అందించాలి

ఏలూరు (టూటౌన్‌): కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డి–ఫారం భూములు తదితర అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజుల్లోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతీలాల్‌ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్‌ మైదీన్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డాక్టర్‌ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ జ్యోతిలతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి–ఫారం భూముల సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పించామన్నారు. కమిటీ పరిశీలన అనంతరం కోరిన అదనపు సమాచారాన్ని, మ్యాప్‌లను త్వరగా అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ, కే.ఆర్‌. కల్పశ్రీ, డీఎఫ్‌ఓలు సందీప్‌ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీపీఓ మల్లికార్జునరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కే.ఎం. అంబేడ్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement