ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ మూ కలు రెచ్చిపోయారు. నగరంలోని 55వ డివిజనల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రసాద్‌పై దాడికి తెగబడ్డారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో దాడులు చేసినట్టు తెలిసింది. బాధితుడు ప్రసాద్ ఏలూరు జీజీహెచ్‌లో వైద్య చికిత్స పొందుతున్నారు. బాధితుడిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు, పార్టీ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఏలూరు 57వ డివిజన్
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను శ్రీ చైతన్య స్కూల్ బస్సుల్లో తరలించడంపై 57వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి వేగి ప్రసాద్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బస్సుల్లో బ్యాలెట్ బాక్సులు తరలించే క్రమంలో వాటిని తారుమారుచేసే అవకాశం ఉన్నందున ఇతర వాహనంలో తీసుకెళ్లాలని ఆయన రిటర్నింగ్ అధికారిని కోరారు. అయితే, రిటర్నింగ్ అధికారి తమ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వేగి ప్రసాద్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
భీమవరం : విజ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం స్థా నిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్ర జల్లో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్న జన విజ్ఞాన వేదికను అభినందించారు. శాసీ్త్రయ దృక్పథాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అ న్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కే ఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, వేగేశ్న రాధ, నక్కా వెంకటేశ్వర్లు, జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ : అర్నబ్ తుపాను వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పంట పొలాల్లో నీరు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర బృందం ఆదివారం పెనుగొండ మండలంలో పర్యటించింది. వడలి గ్రామంలో పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. పొలాల్లో నిలిచిపోయిన నీటిని, దెబ్బతిన్న పంటలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడింది.


