సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యం

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

ముదినేపల్లి రూరల్‌: పేదల కష్టాలు తొలగించే సంక్షేమ రాజ్యం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. మండలంలోని పెనుమల్లిలో పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు రామిశెట్టి సత్యనారాయణ, ఈడే వెంకటేశ్వరమ్మ, ముత్యాల రెలీషా తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలనలో అన్నివర్గాల పేదలు సంక్షేమ ఫలాలు పొంది ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. క్రమం తప్పకుండా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక పింఛన్లు మంజూరు చేసి వారి పాలిట ఆప్తుడుగా నిలిచారన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా విరుద్ధంగా వ్యవహరిస్తూ పింఛ న్లు మంజూరు చేయకుండా అర్హుల ఉసురు తీస్తోందని విమర్శించారు. రైతు పక్షపాతిగా జగన్‌ వ్యవహరించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తుపాను దెబ్బకు నిండా మునిగిన అన్నదాతలను ఆదుకోకుండా నిట్టనిలువునా ముంచేసి రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తోందన్నారు. అలాగే మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి దగా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన ఆయా వర్గాలంతా రానున్న జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పెనుమల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న డీఎన్నార్‌

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement