ఓటెత్తలేదు | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తలేదు

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

ఓటెత్తలేదు

సాక్షి, భీమవరం: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ.కోట్లు కుమ్మరించిన కూటమి నేతలను షాక్‌కు గురిచేస్తూ పోలింగ్‌ మందకొడిగా సాగింది. చంద్రబాబు ప్రభుత్వంపై గూడుకట్టుకున్న వ్యతిరేకత పురపోరులో స్పష్టంగా కనిపించింది. ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్‌ మధ్యాహ్నం సమయానికి కాస్త పుంజుకుంది. మొత్తంగా నరసాపురం మున్సిపాల్టీలో 71.37 శాతం, ఆకివీడులో 74.47 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.

ఉదయం మందకొడిగా..

నరసాపురంలో 36 వార్డుల పరిధిలో 71, ఆకివీడులో 19 వార్డుల్లో 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం ఏడు గంటల నిర్ణీత సమయానికే పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోయాయి. 10 గంటల సమయం దాటాక పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్ల రద్దీ మొదలైంది. సాయంత్రం పోలింగ్‌ ముగిసే సరికి నరసాపురంలో 46,996 మంది ఓట్లకు గాను 33,543 ఓట్లు, ఆకివీడులో 26,435 ఓట్లకు 19,687 ఓట్లు పోలయ్యాయి.

తెగిపడిన నోట్ల కట్టలు

కూటమి నేతలు ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఎన్నికల్లో విచ్చలవిడిగా రూ.కోట్లల్లో డబ్బు ఖర్చుచేశారు. మద్యాన్ని ఏరులై పారించారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై సానుకూలతకు జడిసి నరసాపురం, ఆకివీడులో కూటమి చైర్మన్‌, కౌన్సిలర్లు అభ్యర్థులు కలిపి ఓటుకు రూ.1,500 నుంచి రూ.4,000 వరకు నగదుతో పాటు కొందరు చీరలు, మరికొందరు రైస్‌కుక్కర్లు, వెండి భరిణలు, ఇంటింటికి బిర్యానీ ప్యాకెట్లు తదితర వాటిని పంపిణీ చేశారు. నరసాపురంలోని ఒక వార్డుల్లో కూటమి అభ్యర్థి, స్వతంత్య్ర అభ్యర్థి కలిపి వస్తు ధన రూపంలో ఓటుకు రూ.10 వేలకు పైనే ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి మొదలైన పంపకాలు కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే వరకు కొనసాగడం గమనార్హం. ఆకివీడులోని ఒక వార్డులో కూటమి అభ్యర్థి మధ్యాహ్నం నుంచి కూడా మరోదపా అదనంగా ఓటుకు రూ.1,000 పంపిణీ చేసినట్టు సమాచారం.

కూటమి నేతల బరితెగింపు

అధికార బలంతో కూటమి నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్ద యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కూటమికి చెందిన అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం సాగించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలోనే తమకు ఓటు వేయాలంటూ హడావుడి చేశారు.

మందకొడిగా మొదలైన పోలింగ్‌

10 గంటల నుంచి పెరిగిన పోలింగ్‌ శాతం

పోలింగ్‌ కేంద్రాల వద్ద కూటమి పక్షాల ప్రచారం

చోద్యం చూసిన యంత్రాంగం

నరసాపురంలో 71.37 శాతం, ఆకివీడులో 74.47 శాతం పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement