కలిదిండి (కైకలూరు) : అత్యధిక మెజార్టీతో ఏలూరు జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కలిదిండి మండలంలో జెట్పీటీసీ అభ్యర్థి కూసంపూడి కనకదుర్గారాణి, ఎంపీపీ అభ్యర్థి కొల్లాటి దుర్గా ధనలక్ష్మితో కలసి పెదలంక, పెదపుట్లపూడి, మూలలంక, భాస్కరరావుపేట, సంతోషపురం, అమరావతి, గుర్వాయిపాలెం, కొండంగి, మట్టగుంట గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో డీఎన్నార్ మాట్లా డుతూ కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో జెట్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లా జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన అభ్యర్థులను బరిలో దించామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన మంచిని అందరూ గమనించారన్నారు. అ త్యధిక మెజార్టీతో జెట్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జెట్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు కూసంపూడి కనకదుర్గారాణి, ఎంపీపీ అభ్యర్థి కొల్లాటి దుర్గా ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తాం.. ఓటు రూపంలో అవకాశం కల్పించాలని కోరారు. కొండంగి గ్రామం నుంచి కూటమి నాయకులు బోడిగడ్డ యోహాను, తెనాలి పండు, జంగం కిరణ్, జీవా, బొమ్మలూరు దేవస్వామి, అబ్రహం, శ్రీను, వినోద్‌లు వైఎస్సార్‌సీపీలో డీ ఎన్నార్ సమక్షంలో చేరారు. ఆయా సెగ్మెంట్ల ఎంపీటీసీ సభ్యులు పంపన భాస్కరరావు, నడకుడుతి క రుణ బాలచంద్రుడు, పల్లికొండ సంయుక్త, బొంతు కనకదుర్గా, గజ్జల చిన వెంకమ్మ, ఇమ్మానేని రమాదేవి, మాజీ ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు నాయకులు పోసిన చెంచురామారావు, చిట్టూరి మురళీ, తిరుమాని రమేష్, వడపు రామారావు, కొల్లాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


