ద్వారకాతిరుమల: గ్రామీణ విద్యార్థులు జాతీ య స్థాయిలో వినూత్న ఆలోచనలతో రాణించడం గర్వకారణమని శ్రీవారి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. స్థానిక దేవస్థానం హైస్కూల్ విద్యార్థిని పోలుబోయిన లక్ష్మి జాతీయ స్థాయి ఇన్‌స్పైర్–మనక్ పోటీల్లో ప్రతిభ చాటి కేంద్ర ప్రభుత్వ ప్రశంసా పత్రాన్ని అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో మహిళల భద్రతపై లక్ష్మి రూ పొందించిన వినూత్న ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రశంసా పత్రాన్ని అందించాయి. విద్యార్థినిని ప్రోత్సహించినందుకు పాఠశాలకు సైతం గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా విద్యార్థిని లక్ష్మిని, హెచ్‌ఎం పి.శేషుకుమార్, గైడ్ టీచర్ సీహెచ్ కాంతారావు, సైన్స్ ఉపాధ్యాయులను చైర్మన్ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు సోమవారం అభినందించారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని ఆలయ చైర్మన్ జ ల్లూరి వెంకన్న సమక్షంలో సోమవారం లెక్కించారు. 110 రోజులకు రూ.14,41,433 ఆదా యం లభించినట్టు ఈఓ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు.
నూజివీడు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 28 నుంచి 30 వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి కొరపాటి పీరయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ముందుగా అవసరమైన ఫారాలు (ఓటర్ ఐడీ, ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్డర్ కాపీ)ని తీసుకుని సంబంధించిన అర్జీతో జతచేసి కౌంటర్ నందు ఇవ్వాలని పేర్కొన్నారు.


