జంగారెడ్డిగూడెం.. ఆమే కీలకం | - | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెం.. ఆమే కీలకం

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రభుత్వం బీసీ మహిళలకు రిజర్వ్‌ చేసింది. మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం జనరల్‌ కేటగిరికి దక్కుతుందని ఆశపడిన ఆశావహులకు రిజర్వేషన్లు నిరాశను మిగిల్చాయి. జంగారెడ్డిగూ డెం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. 2014లో బీసీ మహిళ, 2021లో జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. మరలా మరోమారు మహిళలకు అవకాశం వచ్చింది.

బరిలో 78 మంది అభ్యర్థులు

మున్సిపల్‌ బరిలో 78 మంది నిలిచినట్టు కమిషనర్‌ కేవీ రమణ తెలిపారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి 32, టీడీపీ నుంచి 22, బీజేపీ నుంచి 1, సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 1, జనసేన నుంచి 9, ఇండిపెండెంట్లు 12 మంది ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ దూకుడు

పుర పోరులో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. చైర్‌పర్సన్‌ పీఠంతో పాటు 32 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సుమారు 21 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. వీరంతా ప్రచారంలో దూసుకుపోతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మహిళా ఓటర్లే అధికం

మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనలో భాగంగా గతంలో 29 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పెంచారు. బూత్‌లు 64, మొత్తం ఓటర్లు 48,463 మంది ఉండగా వీరిలో 23,409 మంది పురుషులు, 25,025 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నారు. అయితే అత్యధికంగా 1,616 మంది మహిళలు ఉన్నారు. అన్ని వర్గాల్లోనూ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

పుర పోరులో అతివల హవా

జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌

గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ

వైఎస్సార్‌సీపీ నుంచి పోటీలో 21 మంది మహిళా అభ్యర్థులు

కూటమిలో జనసేన, బీజేపీకి నామమాత్రంగా వార్డుల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement