తుపానుపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తుపానుపై అప్రమత్తం

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

తుపానుపై అప్రమత్తం

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం తుపాను తీవ్రత, నష్ట నివారణపై అధికారులతో సమీక్షించారు. మంగళవారం సాయంత్రం నుంచి భారీవర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కల్వర్టులు, కాజ్‌వేలను ప్రజలు దాటకుండా చూడాలన్నారు. పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అధికారులు ఈనెల 29 వరకు ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు ఏలూరు కలెక్టరేట్‌లో 18002331077, 08812– 224519, 9491041419 నంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థలకు సెలవు

జిల్లాలో అర్నాబ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం, విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

విద్యుత్‌ కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తుపాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామని ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ కేఎం అంబేద్కర్‌ తెలిపారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూమ్‌ లు ఏర్పాటుచేశామన్నారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేట లోని విద్యుత్‌ భవన్‌ 9440902926, ఏలూరు డివిజన్‌ కార్యాలయం 9440904037, జంగారెడ్డిగూడెం డివిజన్‌ కార్యాలయం 9491030712తో పాటు వి ద్యుత్‌ సంబంధిత ఫిర్యాదులను టోల్‌ఫ్రీ నంబర్‌ 1912 ద్వారా కూడా నమోదు చేయవచ్చని సూచించారు. ప్రజలు విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement