వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి మరో అడుగు పడింది. కూటమి ప్రభుత్వ పాలనపై వ్యక్తమవుతున్న అసంతృప్తితో లక్కవరం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు సమక్షంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంగా సురేష్‌ బండారు ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిర్ల దుర్గా రెడ్డి నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సంక్షేమ పథకాల అమలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము పార్టీలో చేరుతున్నట్లు నూతనంగా పార్టీలోకి వచ్చిన కుటుంబాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ నాయకులు సాదరంగా ఆహ్వానించి, కండువాలు కప్పారు. లక్కవరంలో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ భారీ చేరికలే నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు మహంకాళి రంగప్రసాద్‌, వందనపు వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement