ఎన్నికల కోడ్‌ పట్టదా? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ పట్టదా?

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

ద్వారకాతిరుమల: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ద్వారకాతిరుమలలో రాజకీయ ఫ్లెక్సీ దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. భీమడోలు–ద్వారకాతిరుమల ప్రధాన రహదారి పక్కన నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చిత్రాలతో కూడిన గ్రామ స్వరాజ్యం సంకల్ప పాదయాత్ర ఫ్లెక్సీని ఇటీవల ఓ టీడీపీ నాయకుడు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ ప్రచార ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఇది ప్రధాన రహదారి పక్కనే దర్శనమిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, ఆ ఫ్లెక్సీని తొలగించడంతో పాటు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement