ముగిసిన టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన టెన్నిస్‌ పోటీలు

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

ముగిసిన టెన్నిస్‌ పోటీలు

పాలకొల్లు సెంట్రల్‌: స్థానిక కాస్మో కాంప్లెక్స్‌లో ఈ నెల 16న ప్రారంభించిన సీహెచ్‌ బుద్దావతారం రాజు మెమోరియల్‌ ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కాంప్లెక్స్‌ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌ రాజు మాట్లాడుతూ కాస్మో కల్చరల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ద్వారా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సెక్రటరీ జి. బూన్‌రాజు, వీవీ సోమరాజు, అరిటాకుల రాంబాబు, అంపైర్లుగా వినుకొండ దినేష్‌, పి.వరప్రసాద్‌రాజు, గజేంద్ర నాయుడు, సారిక రామచంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement