వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

యలమంచిలి: ఏనుగువానిలంక గ్రామానికి చెందిన జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ ఆ పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), పార్టీ సీఈసీ సభ్యుడు గుణ్ణం నాగబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు జయభేరి మోగించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. నాగబాబు మాట్లాడుతూ ఈ చేరికలు కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత మంది వైఎస్సార్‌సీపీలో చేరతారన్నారు. పార్టీలో చేరిన వారిలో జనసేన నుంచి నారిన వెంకటేశ్వరరావు, మారిశెట్టి వెంకట నారాయణ (శ్రీను), మారిశెట్టి నారాయణరావు (చిన్న), దేవరపు రామాంజనేయులు, తెలుగుదేశం నుంచి నారిన హరికుమార్‌ ఉన్నారు. ఈ నాయకులతో పాటు వారి బంధువులకు చెందిన సుమారు 50 కుటుంబాలు పార్టీకి మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఉచ్చుల స్టాలిన్‌బాబు, గ్రామ అధ్యక్షులు మల్లుల కొండ, ఉల్లంపర్తి జాన్‌, నాయకులు ఇనుకొండ రవికుమార్‌, వీరా ఉమాశంకర్‌, పాలపర్తి సందీప్‌, దిడ్ల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement