న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, ఏలూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి పతాకస్థాయికి చేరింది. మంచిరోజు కావడంతో జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు రెండు మున్సిపాల్టీల్లో కలిపి ఒకేరోజు 205 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనున్న క్రమంలో అభ్యర్థులు పార్టీలవారీగా భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు.
ఏలూరులో వైఎస్సార్‌సీపీ జోష్
ఏలూరు నగరపాలక సంస్థలో శనివారం 123 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా గంటా మోహనరావు (జీఎంఆర్) భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్, పుప్పాల వాసుబాబుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మేయర్ అభ్యర్థుల్లో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడుతో పాటు మరో అభ్యర్థి, ఆర్‌పీఐ పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. కార్పొరేటర్ స్థానాలకు తొలిరోజు 5 నామినేషన్లు దాఖలవ్వగా, నేడు 123 నామినేషన్లు పడ్డాయి. మొత్తంగా 62 డివిజన్లకు 128 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా వైఎస్సార్‌సీపీ నుంచి 47, బీజేపీ నుంచి 2, టీడీపీ నుంచి 49, జనసేన నుంచి 13, ఆర్‌పీఐ నుంచి ఒకటి, ఇండిపెండెట్లు 16 నామినేషన్లు వేశారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మేకా సత్యవతి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావుతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 32 వార్డులకు తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా.. రెండో రోజు ఊపందుకున్నాయి. వార్డు స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల వారీగా వైఎస్సార్‌సీపీ నుంచి 14, టీడీపీ నుంచి 13, జనసేన నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
నూజివీడులో.. నూజివీడులో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. 36 వార్డులకు 49 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 11, టీడీపీ నుంచి 32, జనసేన నుంచి 4, టీడీపీ రెబల్స్‌గా ఇద్దరు నామినేషన్లు వేశారు. అయితే చైర్‌పర్సన్ అభ్యర్థికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
అధికార యంత్రాంగం ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియలో విధులు కేటాయించారు. శిక్షణా తరగతులు నిర్వహించి పోలింగ్ కేంద్రాల్లో విధులు కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఫ్లగ్‌మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదివారంతో నామినేషన్ల దాఖలు పూర్తి
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం మఽ ద్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. దీంతో నా మినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి జీఎంఆర్ నామినేషన్ దాఖలు
జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్ అభ్యర్థిగా సత్యవతి నామినేషన్
రెండో రోజు వెల్లువెత్తిన నామినేషన్లు
నేటితో ముగియనున్న నామినేషన్ స్వీకరణ ప్రక్రియ


