● మూడు దశల్లో ఎన్నికలు
● వచ్చేనెల 15 నుంచి నిర్వహణ
● జిల్లాలో 542 పంచాయతీలు.. 5,676 వార్డులు
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు వచ్చేనెల 15 నుంచి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. 542 పంచాయతీల్లో సర్పంచ్లు, 5,676 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు 5,801 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు నిర్వహించన రోజే ఫలితాలు వెల్లడిస్తామని, అవసరమైతే తర్వాత రోజు రీ పోలింగ్ చేపడతామని పేర్కొన్నారు.
వీడియో చిత్రీకరణ
ఎన్నికల విధులను కేటాయించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు వీడియోలు చిత్రీకరిస్తామని, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. అలాగే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించామన్నారు.


