పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పటిష్ట బందోబస్తు

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

పటిష్ట బందోబస్తు నేటితో నామినేషన్ల స్వీకరణ పూర్తి ఫారం–ఏ అందజేత బీసీ రిజర్వేషన్లలో చంద్రబాబు మోసం

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పోలింగ్‌ కేంద్రాన్ని ఐజీ అశోక్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. ఎన్నికలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. ఆయా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. నామినేషన్ల ఆఖరి రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున బందోబస్తు పక్కాగా ఉండాలన్నారు. ఎస్పీ నయీం అస్మి, అదనపు ఎస్‌పీ భీమారావు, డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, సీఐ కాళీచరణ్‌, ఎస్కై శుభశేఖర్‌ ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఎన్నికలకు ఆదివారం వారం నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్‌, ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తామని, ఈనెల 28న ఎన్నికలు, 30న కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

21 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు..

జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు, 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందన్నారు. 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, అదే రోజు సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తామన్నారు. వచ్చేనెల 3న ఎన్నికలు, 5న కౌంటింగ్‌ చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో దాఖలు చేసే అభ్యర్థులకు సంబంధించి పలు రాజకీయ పార్టీల అధినేతలు వారికి చెందిన అభ్యర్థులకు జారీ చేసే బీ–ఫారం పత్రాలను జారీ చేసే అధికారిక ప్రతినిధి లేఖలు ఫారం–ఏను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు శనివారం కలెక్టర్‌కు అందజేశారు. సదరు లేఖల్లో సిఫార్సు చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని కోరారు.

భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు మోసం చేశారని బీసీ కులాల జేఏసీ మండిపడింది. స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌లో శనివారం విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. బీసీ సంఘాల లీగల్‌ సలహాదారుడు, న్యాయవాది మల్లవరపు శివరామ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుందని దుయ్యబట్టారు. 34 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌ కోర్టుల్లో ప్రభుత్వం నిరూపించలేని కారణంగా అన్యాయం జరిగిందన్నారు. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ రిపోర్ట్‌ ప్రకారం జిల్లా, మండల, మున్సిపల్‌ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా దానికనుగుణంగా సీట్లు పంపకం జరగలేదన్నారు. 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోగా.. సీఎం చంద్రబాబు పార్టీ తరఫున 40 శాతం సీట్లు ఇస్తామన్నది పచ్చి అబద్ధమన్నారు. బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతపల్లి గురుప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీలు 25 ఏళ్లుగా వరుసగా జనరల్‌ రిజర్వు కావడం బీసీలను అణగదొక్కే రాజకీయ కుట్ర అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement