పారదర్శక ఎన్నికలు లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక ఎన్నికలు లక్ష్యం

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక జిల్లాపరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నిష్పక్షపాతంగా ఎన్నికలు ని ర్వహించాలన్నారు. ఎన్నికల సంఘ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నామినేషన్‌ దా ఖలు నుంచి నామినేషన్‌ పరిశీలన, పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడించే ప్రక్రియ వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్‌ బాక్సు లు నాణ్యతను పరిశీలించుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశం గురించి నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement