కై కలూరు: రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సేవలను గుర్తించి, తిరిగి ఆయన సీఎంగా రావాలనే ఉద్దేశంతో కూటమి నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కూటమికి చెందిన టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాళ్ల కృపావరం కై కలూరు పార్టీ కార్యాలయంలో కలిదిండి జెడ్పీటీసీ అభ్యర్థి కూసంపూడి కనకదుర్గాదేవి ఆధ్వర్యంలో డీఎన్నార్ సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. కృపావరం కలిదిండి మండలం చినతాడినాడ సర్పంచ్, ఎంపీటీసీగా గతంలో పనిచేశారు. పార్టీ అభివృద్థికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగ కార్యదర్శి జాన్‌విక్టర్, నాయకులు చిట్టూరి మురళీ, కూసంపూడి సత్యరాజు, సాగిన సుబ్బరాజు, గండికోట ఏసుబాబు, స్టివెన్‌సన్, సువర్ణరాజు, శేఖర్, బొర్రా శ్రీను, గొల్ల మరియరాజు తదితరులు పాల్గొన్నారు.


