సాక్షి, టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్‌సీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. సోమవారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యక్రమాలు ముగించుకుని అబ్బయ్యచౌదరి తిరిగి వస్తుండగా పెదవేగి మండలం వేగివాడ వద్ద టీడీపీ గూండాలు అడ్డుకొని, ఆయన వాహనంపైకి దూసుకొచ్చి, కారు అద్దాలు పగులగొట్టారు. అయినా అబ్బ య్యచౌదరి వెరవకుండా ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు కూడా వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోబోగా, పెద్ద గొంతులతో వాగ్వాదానికి దిగారు. కేకలు, అరుపులతో 2 గంటల పాటు అక్కడ హంగామా సృష్టించారు. చివరకు పోలీసులు వారిని అక్కడి నంచి బలవంతం పంపించాల్సి వచ్చింది.
మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?: అబ్బయ్య చౌదరి
అనంతరం అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార చంద్రబాబు కూటమి నేతల అరాచకాలు పెచ్చుమీరి పోయాయని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని అన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు రక్తం వచ్చేలా కొట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. పదేపదే కొల్లేరు వాసులకు డబ్బు ఇవ్వాలని మాట్లాడుతున్నారని, తా ను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని చె ప్పారు. ధైర్యం ఉంటే కలెక్టర్‌తో ఒక కమిటీ వేయించాలని, ఆ కమిటీ నివేదికలో అబ్బయ్యచౌదరి ఒక్క రూపాయి తీసుకున్నాడని నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కొల్లేరు ప్రజలకు ఎవరు న్యాయం చేశారో కూడా ఆ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక కొల్లేరును అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొల్లేరువాసులపై ఎంతలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసని చెప్పారు.
పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి
అబ్బయ్యచౌదరి కారుపైకి దూసుకువస్తున్న టీడీపీ శ్రేణులు
వేగివాడ వద్ద వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల దాడిలో పగిలిన కారు అద్దాలు
ఏలూరులో పార్టీ కార్యాలయం వద్దా అదే గూండాయిజం
రెండు గంటలపాటు హంగామా.. బలవంతంగా పంపించిన పోలీసులు
కొల్లేరువాసులకు తానేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదని అబ్బయ్యచౌదరి స్పష్టీకరణ
ధైర్యం ఉంటే కలెక్టర్‌తో కమిటీ వేయించాలని సవాల్
కొల్లేరువాసులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాలు అందరికీ తెలుసని వెల్లడి


