వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యా ణ మండపంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు సన్నాహక సమావేశం సోమ వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం లే కుండా ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేలా ముందస్తు ప్రణాళికతో ముందుకు సా గాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు సవాళ్లుగా స్వీకరించి సమన్వయంతో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టాలన్నారు.
సైనికుల్లా పనిచేయాలి
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల బరిలో నిలవాలన్నారు. దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్ మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ సమర్థులైన అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ అధ్యక్షుడు కర్పూరం గవ రయ్య గుప్తా, మండల అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్, బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, చంద్రిక, భావన ఋషి, కంచర్ల వాసవి రత్నం, ముప్పిడి వీరాంజనేయులు, కుర్రు రవి, బత్తిన చిన్న, ఐజీ, చిటికెల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.


