కొల్లేరు సమాచారాన్ని అందించాలి
కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వచ్చేనెల 5లోపు సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. 8లో u
ఏలూరు టౌన్: నశాముక్త్ భారత్ అభియాన్‌లో ఏలూరు ఈగల్ వింగ్, 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలో డ్రగ్స్‌కు వ్యతిరేక అవగాహన ర్యాలీని భారీఎత్తున నిర్వహించారు. నగరంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన 200 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. నగరంలో ఫైర్‌స్టేషన్ సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈగల్ వింగ్ ఆర్‌ఎస్‌ఐ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారకుండా నిరోధించటం, ప్రజలకు మత్తుపదార్థాల వినియోగంతో అనర్థాలను వివరిస్తున్నామని తెలిపారు. యువత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం, విద్యతోనే ఉన్నత భవిష్యత్ సాధిస్తారనేది అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే హెల్ప్‌లైన్ నం.1972 లేదా పోలీస్ అత్యవసర నం.112కు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే సామాజిక అంశాలపై అవగాహన, నైతిక విలువలు, ఉన్నత విద్య, మత్తుతో అనర్థాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. కల్నల్ అమిత్ పాండే, కల్నల్ బిప్‌నీత్ సింగ్ చీమా తదితరులు ఉన్నారు.


