స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

హామీలను అటకెక్కించి వెన్నుపోటు: వాసుబాబు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

గణపవరం: కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. జగన్‌ సంక్షేమ పా లనను ప్రజలకు గుర్తుచేద్దాం.. మనమంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కేవీపీ కన్వెన్షన్‌ హాలులో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్‌ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ అక్రమాలు, మోసాలపై పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. అక్రమాలను అడ్డుకుంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు.

కూటమి పింఛన్ల డ్రామా

ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ పరిశీలకుడు వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎన్నిక జరిగినా జగన్‌ బరిలోకి సింగిల్‌గానే వస్తారని, అ ధికారం కోసం కనపడిన ప్రతివారితో చేతులు కలిపి వాళ్ల కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క కొత్త పింఛన్‌, ఇంటి స్థలం ఇవ్వలేదన్నారు. చేతకాని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. పింఛన్ల మంజూరు డ్రామా అని దుయ్యబట్టారు.

ఎంపీపీ అర్ధవరం రాము, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ నాయకుడు పెనుగొండ బాలకృష్ణ, పార్టీ నేత వెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎ న్నికల్లో ఆయా గ్రామాల నాయకులే అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకునే బాధ్యత తీసుకోవాల న్నారు. అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. టీటీడీ మాజీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, నా లుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల నా యకులు, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా ముగించిన నాలుగు మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వాసుబాబు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో జరి గిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ కూటమి ప్రభుత్వానికి మరణశాసనం రాస్తున్నాయన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ములేని దద్దమ్మలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ఎ దురుదాడికి తెగబడుతున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్‌ హామీలను అటకెక్కించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 50 ఏళ్లకే పింఛన్‌, మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, వలంటీర్ల కొనసాగింపు, వారికి నెలకు రూ.10 వేల వేతనం, ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏల చెల్లింపు హామీలన్నీ ఏమాయ్యాయన్నారు. పార్టీకి కా ర్యకర్తలే నిజమైన నాయకులని, వారికోసం తా మంతా ఎంతటి త్యాగాలకై నా సిద్ధంగా ఉంటామన్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్‌ అధికారం రుచి మరిగి ప్రశ్నించడమే మ రిచిపోయారన్నారు. ప్రజలకు ఎప్పుడైనా అండగా ఉండేది, భరోసా ఇచ్చేది వైఎస్సార్‌సీపీ మాత్రమే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement